తెలంగాణ

telangana

ETV Bharat / briefs

భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు - sangareddy

కుటుంబ కలహాలు ఆ పిల్లల ప్రాణాలు హరించాయి. ఆడుకునే వయసులో వారిని అనంతలోకాలకు చేర్చాయి. భార్య వదిలేసి వెళ్లిపోయిందనే కోపంలో పిల్లలిద్దర్ని హతమార్చాడు. కన్న తండ్రే కర్కశంగా మారి ఆ చిన్నారుల ప్రాణాలు తీశాడు.

భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు

By

Published : Apr 17, 2019, 9:42 AM IST

Updated : Apr 17, 2019, 5:15 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబాయికాలనీలో జరిగిన హత్యలు కలకలం రేపింది. కన్న తండ్రే కాలయముడుగా మారి తన పిల్లల్ని హతమార్చిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బొంబాయికాలనీలో నివాసముండే శిరీష భర్త కుమార్ వేధింపులు భరించలేక... పిల్లల్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వదిలేసి వెళ్లిందనే అక్కసుతో పిల్లల్ని హతమార్చాలని పన్నాగం పన్నాడు కుమార్.

ఒకర్ని కత్తితో.. మరొకర్ని ఉరి వేసి..

ప్రతిరోజు నాయనమ్మ, మేనత్తల వద్ద పడుకునే పిల్లల్ని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు​. కుమారుడు అఖిల్​ను కత్తితో గొంతు కోసి హతమార్చి.. చిన్న కుమార్తె శరణ్యను వంట గదిలో ఉరి వేశాడు. పెద్ద కుమార్తె మల్లీశ్వరి గొంతు కోయడానికి ప్రయత్నించగా .. ఆమె తప్పించుకుని నాయనమ్మ వద్దకు చేరుకుంది.

ఈ ఘటనలో అఖిల్​, శరణ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ పెద్ద కుమార్తె మల్లీశ్వరిని పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పిల్లలను హత్య చేసిన కుమార్​ను స్థానికులు పట్టుకొని చితకబాది రామచంద్రాపురం పోలీసులకు అప్పగించారు.

భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు

ఇదీ చూడండి: కరెంటు వాడకం పల్లెల్లో తగ్గింది నగరాల్లో పెరిగింది

Last Updated : Apr 17, 2019, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details