తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దిల్లీలో భాజపా హవా, ఆప్​కు సున్నా!: ఎగ్జిట్​పోల్స్​

దిల్లీలో మరోసారి భాజపా సత్తా చాటుతుందని ఎగ్జిట్​పోల్స్​ అంచనా వేశాయి. ఆరు నుంచి ఏడు లోక్​సభ స్థానాలను ఆ పార్టీయే కైవసం చేసుకుంటుందని అధిక సంస్థలు వెల్లడించాయి. ఆమ్​ఆద్మీకి ఒక్కస్థానం కూడా దక్కదని తేల్చాయి ఎగ్జిట్​ పోల్స్​.

ఆమ్​ఆద్మీ, భాజపా

By

Published : May 20, 2019, 6:38 AM IST

Updated : May 20, 2019, 7:17 AM IST

దిల్లీలో ఉన్న ఏడు లోక్​సభ స్థానాలను భారతీయ జనతా పార్టీయే కైవసం చేసుకుంటుందని చాలా ఎగ్జిట్​పోల్స్​ తేల్చిచెప్పాయి. సీఎం కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ఆద్మీ పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కదని అంచనా వేశాయి. అయితే కాంగ్రెస్​ ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని కొన్ని పోల్స్​ వెల్లడించాయి.

2014 ఫలితాలను పునరావృతం చేస్తూ దిల్లీలోని ఏడు లోక్​సభ స్థానాలకు భాజపా సొంతం చేసుకుంటుందని ఇండియా టీవీ-సీఎన్​ఎక్స్​ అంచనా వేసింది.

ఆరు స్థానాలు భాజపా గెలుచుకుంటే, ఒక స్థానాన్ని కాంగ్రెస్​ దక్కించుకుంటుందని వెల్లడించింది ఇండియా టుడే-యాక్సిస్​ మై ఇండియా.
ఏడు స్థానాలూ భాజపావేనని అంచనా వేసింది న్యూస్​ 24 - చాణక్య.

ఆరు నుంచి ఏడు స్థానాలు భాజపా గెలుస్తుందని, ఒక స్థానంలో కాంగ్రెస్​ విజయం సాధించే అవకాశమున్నట్టు న్యూస్​ 18 ఎగ్జిట్​పోల్​ అంచనా వేసింది.

దిల్లీలోని ఏడు స్థానాలూ భాజపా సొంతం చేసుకుంటుందని సీ-ఓటర్ చెప్పింది. ఆప్​ ఒకస్థానంలో గెలిచే అవకాశమున్నట్టు జన్​ కీ బాత్​ మాత్రమే అంచనా వేసింది. ఆరు నుంచి ఏడు స్థానాలు భాజపావేనని చెప్పింది.

ఎగ్జిట్​పోల్స్​ అంచనా వేసినట్టే ఎన్నికల ఫలితాలు వస్తే ఆమ్​ఆద్మీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.

ఇదీ చూడండి :'నమో 2.0: ఎన్డీఏకే మళ్లీ అధికారం...!'

Last Updated : May 20, 2019, 7:17 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details