రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయ కేంద్రాల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముందుగా స్లాట్లు బుకింగ్ చేసుకున్న అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలించారు. ఇవాళ్టి వరకు 48,786 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. జులై ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన - document verification
ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు ఎంసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు తొలి రోజు 10,016 మంది హాజరయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఈనెల మూడో తేదీ వరకు కొనసాగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన
Last Updated : Jun 28, 2019, 1:23 PM IST