తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగింది' - vice president

పదవిలోకి వచ్చాక ప్రోటోకాల్ పేరుతో ఆంక్షలు ఎదుర్కొంటున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాపోయారు. విశ్వవిద్యాలయాలు అందించే డాక్టరేట్లను సున్నితంగా తిరస్కరించానన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకయ్యనాయుడు

By

Published : May 19, 2019, 3:28 PM IST

Updated : May 19, 2019, 4:51 PM IST

ఉపరాష్ట్రపతి పదవి చేపట్టాక ప్రోటోకాల్ పేరుతో ఎన్నో ఆంక్షలు ఎదుర్కొంటున్నట్లు వెంకయ్యనాయుడు వాపోయారు. గుంటూరు క్లబ్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తీరక లేని కారణంగా విద్యార్థులతో సమావేశాలు, సాంకేతిక విద్య, పరిశోధన సంస్థల సందర్శన, వ్యవసాయం, రైతు సంబంధిత కార్యక్రమాలు వంటి 5 రంగాలను ఎంచుకొని వాటిపై ప్రత్యేక దృష్టి సారించానన్నారు. పర్యటక ప్రాంతాల సందర్శనకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల్లో పెరిగిన ధన ప్రవాహం

ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగిందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కులం, మతం, డబ్బు, నేరస్వభావం ఉన్నవారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. రాజకీయ నాయకుల భాష, మాటలు దిగజారాయని వాపోయారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలను గౌరవించాలని సూచించారు.

ప్రధాని, ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులను గౌరవించాలి

డాక్టరేట్లు వద్దని చెప్పా...

మన దేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. అయినా ఎప్పుడూ ఇతర దేశాలపై దండయాత్రలు చేయకుండా మహాత్ముని శాంతి సందేశంతో భారత్​కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. భారత ఆర్థిక సంస్కరణలపై ఇతర దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. విదేశాంగ సూచన మేరకు ఐరాస శాంతి వర్సటీ గౌరవ డాక్టరేటుకు అంగీకరించానన్నారు.

ఇదీ చూడండి : 'పర్యావరణ నాశనానికి కారణం పెట్టుబడిదారి విధానమే'

Last Updated : May 19, 2019, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details