తెలంగాణ

telangana

ETV Bharat / briefs

విద్యుత్​ శాఖ వెలుగులమయం - power

మింట్​ కాంపౌండ్​లో విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి జగదీశ్​రెడ్డి ఆవిష్కరించారు. అనుభవజ్ఞులైన సీఎండీలతో విద్యుత్ శాఖ​ దూసుకుపోతోందని పేర్కొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ

By

Published : Mar 14, 2019, 12:03 AM IST

Updated : Mar 14, 2019, 12:23 AM IST

విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ
దేశంలో అన్ని విద్యుత్ సంస్థలు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డి. ఉద్యోగుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. మింట్ కాంపౌండ్​లో విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. అనుభవజ్ఞులైన సీఎండీల తోడ్పాటుతో విద్యుత్ శాఖ వెలుగులమయంగా మారిందని కితాబిచ్చారు. సంస్థలో ఉద్యోగులు కూడా భాగస్వాములు కాబట్టి మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఉద్యోగుల కష్టంతోనే నాణ్యమైన విద్యుత్​ను అందిస్తున్నామని ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఉద్యోగులంతా సమష్టిగా పనిచేయాలన్నారు. వృత్తి ధర్మంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు.

Last Updated : Mar 14, 2019, 12:23 AM IST

ABOUT THE AUTHOR

...view details