ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో అన్ని మతాలకు సంబంధించిన పర్వదినాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం షాదీముబారక్, రంజాన్ తోఫాలు, మైనారిటీ గురుకుల విద్యాసంస్థలు సహా అనేక పథకాలు ప్రవేశ పెట్టామని మంత్రి తెలిపారు.
ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శ్రీనివాస్ గౌడ్
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అన్నారు.
రంజాన్
జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత అబ్రహం సహా పలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: రంజాన్ వేళ వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ