ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి... డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి కీలక పదవుల్లో పనిచేశారు. అనంతరం ఓబులాపురం గనుల వ్యవహారంలో చిక్కుకుని సీబీఐ తాఖీదులు అందుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మి... రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ కేడర్‌ను ఎంచుకున్నారు.
ఏపీకి వెళ్లేందుకు 'శ్రీలక్ష్మి' దరఖాస్తు - ias sri laxmi applied for ap cadre
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ కేడర్‌లో ఉన్న ఆమె... తిరిగి ఏపీ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓబులాపురం గనుల వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న శ్రీలక్ష్మి... ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
'శ్రీలక్ష్మి' దరఖాస్తు
ప్రస్తుత పరిస్థితుల రీత్యా తిరిగి ఏపీ కేడరుకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జగన్, తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కొందరు అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్తున్నట్లు సమాచారం. ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు మరికొంతమంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి :జగన్‌తో స్టీఫెన్ భేటీ... గంటసేపు ఆసక్తికర చర్చ