రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. అయితే ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఫలితాలు వెల్లడించరాదని షరతు విధించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ సమాచారం అందింది.
మే మూడో వారంలో షెడ్యూల్ విడుదల..!
జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరిపేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 13, 22 తేదీల్లో ఈసీకి లేఖలు రాసింది. ఇందుకు షరతులతో కూడిన అనుమతి లభించింది. మే నెల మూడో వారంలో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.