ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన గర్భిణిని ప్రసవం కోసం కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యురాలు కొవిడ్ పరీక్ష చేసి పాజిటివ్ ఉందని, కాన్పు చేయాలంటే రూ.5 లక్షలు అవుతుందని చెప్పారు. కుటుంబసభ్యులు పొన్నూరులోని మరో వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చేసిన పరీక్షలో ఆమెకు ‘నెగెటివ్’ వచ్చింది. అక్కడి వైద్యులు కాన్పు చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గర్భిణీకి కరోనా అని చెప్పి.. ప్రసవానికి రూ.5 లక్షలు డిమాండ్ - Guntur district news
ఓ గర్భిణికి కొవిడ్ ఉందని భయపెట్టిన వైద్యులు ప్రసవం చేసేందుకు రూ.5లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేక ఆమె మరో ఆసుపత్రిని ఆశ్రయిస్తే అక్కడ కొవిడ్ లేదని తేల్చి ప్రసవం చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
గర్భిణీకి కరోనా అని చెప్పి.. ప్రసవానికి రూ.5 లక్షలు డిమాండ్