తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సన్​రైజర్స్​ గెలుపు బాట పట్టేనా.? - ఐపీఎల్​ 2019

హైదరాబాద్​ వేదికగా నేడు దిల్లీ క్యాపిటల్స్​ - సన్​రైజర్స్​ జట్లు తలపడనున్నాయి. మళ్లీ గెలుపు బాట పట్టాలని సన్​రైజర్స్​ పట్టుదలగా ఉంది. గత మ్యాచ్​లో 97 పరుగులు చేసి ఫామ్​లోకి వచ్చాడు దిల్లీ బ్యాట్స్​మెన్​ ధావన్​. గత సీజన్​లో హైదరాబాద్​ జట్టుకు ఆడటం శిఖర్​కు కలిసొచ్చే అంశం.

ధావన్ ఫామ్​ను రైజర్స్ బౌలర్లు అడ్డుకుంటారా..!

By

Published : Apr 13, 2019, 6:19 PM IST

Updated : Apr 14, 2019, 8:19 AM IST

సొంత గడ్డపై దిల్లీ క్యాపిటల్స్​తో సన్​రైజర్స్​ హైదరాబాద్​ నేడు తలపడనుంది. గత రెండు మ్యాచుల్లో ఓడిన రైజర్స్​ ఈ మ్యాచ్​తో మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మ్యాచ్​ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

దిల్లీ గెలుపు పరంపరను కొనసాగిస్తుందా..

వరుసగా రెండు విజయాలు సాధించి పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతోంది దిల్లీ క్యాపిటల్స్. శుక్రవారం కోల్​కతాపై గెలిచిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ విజయ పరంపరను ఇలానే కొనసాగించాలని అనుకుంటోంది.

గబ్బర్ మరోసారి మెరుస్తాడా..

గత మ్యాచ్​లో 97 పరుగులతో ఆకట్టుకున్నారు దిల్లీ బ్యాట్స్​మెన్​ శిఖర్​ ధావన్​. చాలా రోజుల తర్వాత అతడు ఫామ్​లోకి రావడం దిల్లీకి కలిసొచ్చే అంశం. పంత్ చెలరేగి ఆడుతున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ పృథ్వీషా.. మిగతా బ్యాట్స్​మెన్ తమ వంతు పాత్ర పోషిస్తే క్యాపిటల్స్​కు తిరుగుండదు.

బౌలర్లు రబాడ, ఇషాంత్, మోరిస్​లు ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను తక్కువ పరుగులకే కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

రైజర్స్​ గెలుపు బాట పట్టేనా..

సన్​రైజర్స్ హైదరాబాద్ గత రెండు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. పరాజయాల బాట నుంచి త్వరగా బయటపడి విజయాన్ని అందుకోవాలని గట్టిగానే కృషి చేస్తోంది సన్​రైజర్స్​. ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్​లో రైజర్స్ గెలిచింది.

మ్యాచ్​ పట్టేయాలంటే ఓపెనర్లు నిలవాలి
హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, బెయిర్​స్టో సీజన్​ మొదట్లో ఆకట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా బ్యాటింగ్​లో విఫలమవుతున్నారు. మిడిలార్డర్​లో విజయ్ శంకర్, మనీష్ పాండే, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్ ఆకట్టుకోలేకపోతున్నారు.

బౌలర్లు కట్టడి చేస్తారా..

బౌలర్లలో పేస్ దళం భువనేశ్వర్, సందీప్ శర్మ, సిద్ధార్థ్​ కౌల్, అఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్, నబీ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేస్తున్నారు. ఈ మ్యాచ్​లో వీరు చెలరేగితే రైజర్స్ గెలుపు ఖాయమే.

జట్లు (అంచనా)

సన్​రైజర్స్ హైదరాబాద్:
​భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్​), మనీష్​ పాండే, డేవిడ్ వార్నర్​, దీపక్ హుడా, నబీ, యూసుఫ్ పఠాన్​, విజయ్ శంకర్​, బెయిర్ ​స్టో, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ

దిల్లీ క్యాపిటల్స్:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, పంత్, ధావన్, ఇషాంత్, రబాడ, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, కీమో పాల్, ఇంగ్రామ్, రాహుల్ తెవాటియా

Last Updated : Apr 14, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details