కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు సాతెల్లి గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో నెల రోజుల నుంచి తీవ్రనీటి ఎద్దడి ఉన్నా... ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. పంట పొలాల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన - office
తాగునీరు లేదని ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోవడం వల్ల ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు కామారెడ్డి జిల్లా సాతెల్లి గ్రామస్థులు
ఖాళీ బిందెలతో నిరసన