తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సీడ్​ కాంగ్రెస్​ ఏర్పాట్లపై సీఎస్​ సమీక్ష - sk joshi

హైదరాబాద్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎస్‌ కే జోషి అధ్యక్షతన తొలి కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్షించారు.

సీడ్​ కాంగ్రెస్​ ఏర్పాట్లపై సీఎస్​ సమీక్ష

By

Published : Jun 10, 2019, 7:17 PM IST

ఈ నెల 26 నుంచి జులై మూడు వరకు హెచ్‌ఐసీసీ నోవాటెల్​లో జరగనున్న సీడ్ కాంగ్రెస్ - 2019 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. పనులన్నింటినీ వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి​ ఎస్​కే జోషి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 800 మంది విత్తన ప్రముఖులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తున్నందున రక్షణపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సదస్సులో భారతదేశానికి, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు.

ఎగుమతులకు ప్రోత్సాహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినందున రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకంగా ఉంటుందని స్పష్టం చేశారు. 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆసియా ఖండంలో అందులోను భాగ్యనగరంలో జరగబోయే ఈ అంతర్జాతీయ విత్తన సదస్సు... చిన్న, మధ్య తరహా విత్తన పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, కమిషనర్ రాహుల్ బొజ్జ, తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ, ధ్రువీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్ కేశవులు, ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, ఉద్యాన శాఖ కమీషనర్ లోక వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :సరళతర వాణిజ్య సంస్కరణలు వేగవంతం చేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details