తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పంట విలువ తగ్గింది.. బీమా పెరిగింది...

వ్యవసాయ పంటల బీమా ప్రీమియం ధరలు ఖరారయ్యాయి. వానాకాలం ఆరంభంలోనే బీమా పేరుతో రైతులపై ఆర్థికభారం మోపినంట్లైంది. వాణిజ్య పంట మిరప, పత్తి పంటకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మొత్తంలో 5శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయని వ్యవసాయశాఖ తెలిపింది.

పంట విలువ తగ్గింది.. బీమా పెరిగింది...

By

Published : Jun 3, 2019, 3:38 PM IST

ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​లో పంటల బీమా ప్రీమియం ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రీమియం వసూలు బాధ్యతను వ్యవసాయ శాఖ రెండు బీమా కంపెనీలకు అప్పగించింది. మిరప పంటకు అత్యధికంగా జోగులాంబ గద్వాల, మహబూబ్​నగర్​, నారాయణపేట, మహబూబాబాద్​, వికారాబాద్​ జిల్లాల్లో హెక్టారుకు రూ. 41,250 ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పత్తి పంటకు రూ. 21,875 నిర్ణయించారు.

2019-20 సంవత్సరంలో మిరప విలువను గత ఏడాది కన్నా 7,500 రూపాయలు తగ్గించడం ద్వారా 1,37,500 రూపాయలుగా ఖరారు చేసి దానిపై చెల్లించాల్సిన ప్రీమియం శాతాన్ని మాత్రం 25 నుంచి 30 శాతం పెంచడం గమనార్హం. పంట విలువ ఎక్కువగా ఉంటే... వైపరిత్యాల వల్ల పైరు దెబ్బతిన్నప్పుడు రైతుకు వచ్చే పరిహారం ఎక్కువగా ఉంటుంది. దాని విలువ తగ్గించడం వల్ల రైతులకు ఇవ్వాల్సిన పరిహారం తగ్గుతుంది.

ప్రీమియం విలువ పెరిగితే రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీమా కంపెనీలకు చెల్లించాల్సిన సొమ్ము పెరుగుతోంది. గతేడాది రూ.లక్షా 45 వేల విలువలో 25 శాతం ప్రీమియం కింద రూ. 36,250 రూపాయలు బీమా కంపెనీలకు చెల్లించారు. ఈ ఏడాది ఈ విలువను రూ. 1,37,500 తగ్గించి ప్రీమియం రేటు 30 శాతానికి పెంచడం వల్ల బీమా కంపెనీకి చెల్లించాల్సిన సొమ్ము 41,250 రూపాయలకు పెరిగింది. అంటే గతేడాది కంటే విలువ రూ.7,500 తగ్గితే ప్రీమియం మాత్రం రూ.5 వేలు పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రీమియం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా చెల్లించాలి.

రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లుగా చేసి బీమా కంపెనీలకు పంటల బీమా అమలు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో క్లస్టర్‌లో 5 నుంచి 6 జిల్లాలు ఉన్నాయి. రెండు క్లస్టర్లకు ఇఫ్కో టోక్యో బీమా కంపెనీ, మిగిలిన నాలుగుకు జాతీయ వ్యవసాయ బీమా కంపెనీకి వసూలు బాధ్యతలు ఇచ్చింది. పత్తికి జులై 15, మిరపకు ఆగస్టు 31 ప్రీమియం చెల్లించే గడువు తేదీలుగా నిర్ణయించారు.

ఇదీ చదవండి: స్విమ్మింగ్​పూల్​లో మెరిసిపోతున్న కాజల్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details