కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సీపీఎం విమర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 16 న సీపీఎం దేశ వ్యాప్త నిరసన చేస్తుందని... ప్రజలు జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య కోరారు.
ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ 16న సీపీఎం దేశవ్యాప్త నిరసన - Corona efffect
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో సీపీఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రాజయ్య ఆక్షేపించారు. ఈ నెల 16 న సీపీఎం దేశ వ్యాప్త నిరసన చేస్తుందని రాజయ్య వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో సీపీఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రాజయ్య ఆక్షేపించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరికీ విస్తృతంగా పరీక్షలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ 10 కేజీల బియ్యం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి రూ. ఏడున్నర వేలు ఇవ్వాలన్నారు. మోదీ ప్రభుత్వం కార్మికులపై కక్ష కట్టిందన్నారు. కార్మిక చట్టాలను సవరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని... లాక్ డౌన్ సమయంలో కార్మికుల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.