కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెరాస, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ద్విచక్రవాహనాలతో తెరాస శ్రేణులు ర్యాలీ నిర్వహించగా.. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాఠోడ్ సతీమణి ఓట్లు అభ్యర్థించారు. గులాబీ అభ్యర్థి గోడం నగేష్ సంక్షేమ పథకాలను వివరించి తనను గెలిపించాలని కోరారు.
కుమురం భీంలో... ప్రధాన పార్టీల పోటా పోటీ ప్రచారం - congress ramesh rathode
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేశారు. ఈరోజుతో గడువు ముగియనుండగా... హోరా హోరీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కుమురం భీం జిల్లాలో పోటా పోటీ ప్రచారం