కలెక్టరేట్ ఎదురుగా కాంగ్రెస్ నేతల ధర్నా - congress dharna
భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెరాస ప్రభుత్వం కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట హస్తం నేతలు ఆందోళన నిర్వహించారు.
కాంగ్రెస్ నేతల ధర్నా
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. భట్టి విక్రమార్కను ఆమరణ దీక్ష నుంచి అరెస్టు చేయడం, పార్టీ ఎమ్మెల్యేలను తెరాస ప్రభుత్వం కొనుగోలు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. డబ్బులను ఎరగా వేసి హస్తం ఎమ్మెల్యేలను కొనుక్కుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క ఆమరణ దీక్షకు భంగం కలిగించారని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.