సీఎం కేసీఆర్ ఐదు రోజుల దక్షిణ భారతదేశ పర్యటనను పూర్తి చేసుకున్నారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరంలో రామనాథస్వామిని దర్శించుకున్నారు. సీఎంతో పాటు తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నారు. రామనాథ స్వామి సన్నిధిలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
మూడు రోజుల ముందే
హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
ఈ నెల పదమూడు వరకు సాగాల్సిన సీఎం పర్యటనను నిర్ణీత గడువుకు ముందే ముగించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 14న ముగియనున్నాయి.
కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరిన కేసీఆర్
ఈ నెల 13 వరకు సీఎం పర్యటన సాగాలి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీఎం మూడు రోజుల ముందే పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 77.63 శాతం పోలింగ్ నమోదు
Last Updated : May 11, 2019, 7:36 AM IST