తెరాసలో సీఎల్పీ విలీనంపై స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు పంపింది. సీఎల్పీ విలీనంపై ఉత్తమ్, భట్టి వేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.
సీఎల్పీ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సీఎల్పీ సమావేశాలు పెట్టాలంటే పీసీసీ అధ్యక్షుడి అనుమతి అవసరమని కాంగ్రెస్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పీసీసీ అనుమతి లేకుండానే పార్టీమారిన ఎమ్మెల్యేలు విలీనం నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి కాంగ్రెస్ శాసనసభ పక్షంగా ఉన్నప్పుడు శాసనసభ, మండలి సభ్యులను వేరువేరుగా మూడింట రెండు వంతుల మందిని ఎలా విలీనం చేస్తారు అని ప్రశ్నించారు.