పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదంపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. భారతదేశ భిన్నత్వంపై సంకుచిత మనస్కులు, మూర్ఖ శక్తులు విజయం సాధించాయని వ్యాఖ్యానించారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం-లైవ్
21:46 December 11
'రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజు'
21:40 December 11
'కోట్లమంది కలలు నిజమౌతున్నాయి'
ప్రతిపాదిత పౌరసత్వ సవరణ చట్టం ద్వారా హింసను ఎదుర్కొన్న కోట్లమంది కలలు నిజమయ్యే రోజు వచ్చిందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. బాధిత ప్రజలకు భద్రత కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
21:36 December 11
'భారత్‌కు చారిత్రక రోజు'
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదంపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారత్‌కు చారిత్రక రోజని వ్యాఖ్యానించారు. ఏళ్లుగా హింసను ఎదుర్కొంటున్న వారికి ప్రతిపాదిత చట్టం ఉపశమనం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.
20:50 December 11
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఏడు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును పెద్దల సభ ఆమోదించింది. 125మంది సభ్యులు అనుకూల ఓటు వేశారు. 105మంది సభ్యులు ప్రతికూలంగా ఓటు వేశారు.
20:25 December 11
ఓటింగ్‌కు శివసేన దూరం
పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో కొనసాగుతున్న ఓటింగ్. శివసేన ఎంపీలు గైర్హాజరు.
20:20 December 11
సెలక్ట్ కమిటీకి పంపేందుకు పెద్దలసభ నిరాకరణ
- బిల్లును సెలక్ట్ కమిటీకి ఇచ్చేందుకు నిరాకరించిన రాజ్యసభ
- నిరాకరణకు అనుకూలంగా 124 ఓట్లు
- నిరాకరణకు వ్యతిరేకంగా 99 ఓట్లు
12:41 December 11
రాజ్యసభలో కొనసాగుతున్న చర్చ
వివాదాస్పద పౌరసత్వ చట్టసవరణ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్రహోంమంత్రి అమత్ షా ఈ బిల్లను పెద్దలసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సభకు వివరించారు షా. దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చామని.. బిల్లుపై అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని విపక్షాలకు సూచించారు. ఎన్నికలకు ముందే బిల్లుపై హామీ ఇచ్చామని.. భారత్‌లో మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంటుందని వెల్లడించారు. అనంతరం ఈ బిల్లుపై విపక్షాలు తమ గళాన్ని వినిపిస్తున్నాయి.
మొత్తం 245 మంది సంఖ్యా బలమున్న పెద్దల సభలో ప్రస్తుతం అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది.
12:27 December 11
అపోహలు వద్దు.. మైనారిటీలకు పూర్తి రక్షణ
దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చామన్నారు అమిత్ షా. బిల్లుపై అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని.. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ బిల్లుపై హామీ ఇచ్చామని పెద్దలసభలో స్పష్టం చేశారు. భారత్‌లో మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంటుందని అమిత్ షా ఈ సందర్బంగా వెల్లడించారు.
- దేశ ఐక్యతను విశ్వసిస్తున్నాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- శరణార్థులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలరు: అమిత్ షా
- ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మేము చేయడం లేదు: అమిత్ షా
- ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ బిల్లుపై హామీ ఇచ్చాం: అమిత్ షా
- సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: అమిత్ షా
- పౌరసత్వ సవరణ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు: అమిత్ షా
- భారత్‌లో మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంది: అమిత్ షా
12:07 December 11
బిల్లుపై చర్చ.. లక్షల మందికి న్యాయం
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ప్రస్తుతం రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెద్దలసభకు వివరిస్తున్నారు. బిల్లు ద్వారా లక్షలమందికి న్యాయం జరుగుతుందని చెప్పారు.
- పౌరసత్వ సవరణ బిల్లు చరిత్రాత్మక బిల్లు: అమిత్ షా
- ఈ బిల్లుతో లక్షల మందికి ప్రయోజనం: అమిత్ షా
- శరణార్థుల హక్కులను బిల్లు కాపాడుతుంది: అమిత్‌షా
- పౌరసత్వ సవరణ బిల్లు చట్ట వ్యతిరేకం కాదు: అమిత్ షా
- బిల్లు ద్వారా మైనార్టీలు హక్కులు పొందుతారు: అమిత్ షా
12:03 December 11
బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా
వివాదాస్పద పౌరసత్వ చట్టసవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
11:38 December 11
మరికాసేపట్లో రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు
ఇటీవలే లోక్‌సభలో ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ చట్టసవరణ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభ ముందుకు రానుంది. మొత్తం 245 మంది సంఖ్యా బలమున్న పెద్దల సభలో ప్రస్తుతం అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశముంది.