తెలంగాణ

telangana

ETV Bharat / briefs

భారత్​కు చేరిన షినుక్​ హెలికాప్టర్లు

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లలో ఒకటైన షినుక్​ భారత అమ్ములపొదిలో చేరాయి. ఎంతో కాలం నుంచి వాయుసేన ఎదురుచూస్తున్న షినుక్​-47ఎప్​(ఐ) హెలికాప్టర్లు గుజరాత్​లోని​ ముంద్రా నౌకాశ్రయానికి చేరుకున్నాయి.

షినుక్​ హెలికాప్టర్​

By

Published : Feb 11, 2019, 7:18 AM IST

భారత వాయుసేన ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న షినుక్​ 47ఎఫ్​(ఐ) హెవీ లిఫ్ట్​ హెలికాప్టర్ల విడిభాగాలు గుజరాత్​ ముంద్రా నౌకాశ్రయానికి ఆదివారం చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమై హెలికాప్టర్లలో ఒకటిగా షినుక్​ గుర్తింపు పొందింది. మొదటి విడతలో నాలుగు హెలికాప్టర్లను సమకూర్చనుంది బోయింగ్​.

అమెరికా ఫిలడేల్పియాలోని బోయింగ్ కర్మాగారంలో తయారైన ఈ భాగాలను ఇక్కడ అసెంబుల్​ చేయనున్నారు. ఛండీగఢ్​కు తరలించి పరీక్షల అనంతరం వాయుసేనకు అప్పగిస్తారు.

సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరిలించేందుకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే ఈ హెలికాప్టర్​ పది టన్నుల బరువులను సైతం తేలికగా తరలిస్తుంది. ఇంధన సరఫరా, విపత్తు సహాయక కార్యక్రమాల్లో ఇవి బాగా ఉపయోగపడుతాయి. ప్రస్తుతం వాయుసేన దగ్గరున్న ఎంఐ 26తో పోలిస్తే షినుక్​ ఇంధన వినియోగమూ తక్కువే.

షినుక్​ హెలికాప్టర్​ను పరీక్షించిన కెనడా

సరిహద్దులకు చేరేందుకు... రవాణా, మౌలిక సదుపాయాల మెరుగుపరుచుకునేందుకు రక్షణ శాఖ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే బోయింగ్ సంస్థ నుంచి 22 అపాచీ, 15 షినుక్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది.

ABOUT THE AUTHOR

...view details