ఐపీఎల్ 12వ సీజన్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు కోల్కతా, చెన్నై. ఆడిన ఐదింటిలో నాలుగు మ్యాచ్లు గెలిచి సమానమైన పాయింట్లతో ఉన్నాయి. చెన్నై కంటే కోల్కతా రన్ రేట్ మెరుగ్గా ఉన్నందున ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. మొదటగా టాస్ గెలిచిన ధోని సేన బౌలింగ్ ఎంచుకుంది.
రెండు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వరుస మ్యాచ్ల్లో అదరగొడుతున్న రసెల్ కోల్కతా జట్టుకు అదనపు బలం.