చారిత్రక చార్మినార్కు ఊడిన పెచ్చులు - CORPORATER
చారిత్రక కట్టడం... యాత్రికులతో రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతం చార్మినార్. అటువంటి చార్మినార్లోని ఒక మినార్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఘటనకు గల కారణలను అధికారులు పరిశీలిస్తున్నారు.
చారిత్రక కట్టడానికి ఊడిన పెచ్చులు
ప్రసిద్ధి గాంచిన చారిత్రక కట్టడం చార్మినార్. ఈ అందమైన కట్టడానికున్న నాలుగు మినార్లలో ఒక దానికి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పత్తర్ గట్టి కార్పొరేటర్, చార్మినార్ ట్రాఫిక్ ఎసీపీ నాగన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా