ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను ఉపయోగించి ఉద్యమాలను ఆపేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇంటర్ పరీక్షల్లో అవకతవకలపై విచారణ కోరుతూ.. విపక్షాలు బోర్డ్ ముట్టడికి యత్నించాయి. కార్యాలయం వద్ద పోలీసులు చాడాను, ఇతర సీపీఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై చాడా మండిపడ్డారు. అన్యాయంగా అరెస్టుచేస్తున్న వారందరినీ తక్షణమే విడదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకూ పోరాడతామన్నారు.
పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు: చాడ - పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు: చాడ
ఇంటర్‌బోర్డు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. కార్యాలయ ముట్టడికి యత్నిస్తున్న రాజకీయ, విద్యార్థినాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిరసనకు యత్నించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
chada-