తెదేపా రాజ్యసభ పక్ష విలీన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఉద్ఘాటించారు. కొందరు ఈ అంశాన్ని అనవసర వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని తెలిపారు. కొందరు తమ అవగాహనరాహిత్యంతో విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా రాజ్యసభ సభ్యుల లేఖ మేరకు వారిని భాజపా సభ్యులుగా గుర్తించినట్లు కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
'తెదేపా విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమే'
తెదేపా విలీన ప్రక్రియను కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగినట్లు కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
CENTRAL MINISTER KISHAN REDDY ON TDP MPS JOINING iN BJP