రాజీవ్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌నూ 2 రోజులు ప్రశ్నించారు. కునాల్ ఘోష్ శారదా పోంజి స్కాంలో ఆరోపణలతో 2013లో అరెస్టయ్యారు. 2016లో బెయిల్‌పై బయటికొచ్చారు.
ప్రశాంతంగా రాజీవ్...
రాజీవ్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌నూ 2 రోజులు ప్రశ్నించారు. కునాల్ ఘోష్ శారదా పోంజి స్కాంలో ఆరోపణలతో 2013లో అరెస్టయ్యారు. 2016లో బెయిల్‌పై బయటికొచ్చారు.
ప్రశాంతంగా రాజీవ్...
సోమవారం.. విచారణ సందర్భంగా రాజీవ్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు అధికారులు. విచారణ సమయంలో ప్రశాంతంగా కనిపించారన్నారు.
సిట్ బృందంలో తానంతా క్రియాశీలకంగా లేనని తెలిపారు రాజీవ్. విచారణ ఎక్కువభాగం డిప్యూటీ కమిషనర్ అర్నాబ్ ఘోషే నిర్వహించారని పేర్కొన్నారు.
శారదా కుంభకోణం కేసులో సాక్ష్యాధారాలను మాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజీవ్‌కుమార్. ఈ అంశంలో ఆయన సహకరించడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ. షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు రాజీవ్‌ను ఆదేశించింది.
శారదా కుంభకోణం విచారణకై ఏర్పాటు చేసిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)లో రాజీవ్ కీలకంగా వ్యవహరించారు.