తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మార్కెట్లోని ఐదు ఉత్తమ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లు ఇవే..!

తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్​ కొనుగోలు చేయాలని బడ్జెట్ ఫోన్ కొనుగోలు చేసేవారు అనుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐదు ఉత్తమ బడ్జెట్ ఫోన్ల వివరాలు.. మీ కోసం.

మార్కెట్లో ఉన్న ఐదు ఉత్తమ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లు ఇవే...

By

Published : Sep 20, 2019, 7:16 AM IST

Updated : Oct 1, 2019, 7:06 AM IST

పండుగ సీజన్ దగ్గరికొచ్చింది. పండుగ సీజన్​లో ఆఫర్లో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. బడ్జెట్​లో రూ.7,000 లోపు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ల గురించిన సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

రెడ్ మీ 7ఏ

బడ్జెట్​ ఫోన్​లో రెడ్​మీ 7 గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ ఫోన్​.. 2జీబీ ర్యామ్​తో 16 జీబీ/32 జీబీ వేరియంట్​లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 5.45 అంగులాల డిస్​ప్లేతో ఫుల్​హెచ్​డీలో ఈ ఫోన్​ అందుబాటులో ఉంది. 12 ఎంపీల రియర్​ కెమెరా, 5 ఎంపీల సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్​లో పొందుపరిచారు. జులైలో విడుదలైన ఈ ఫోన్​ ధర ప్రస్తుతం రూ.5,999గా నిర్ణయించేది.

రియల్ మీ సీ2

6.1-ఇంచుల డ్యూడ్రాప్​ ఫుల్​స్ర్కీన్​తో ఈ మోడల్​ను తీసుకువచ్చింది రియల్​ మీ. ఇందులో 4000 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ ఫోన్​లో పొందుపరిచారు. హీలియో పీ22 చిప్​సెట్​తో ఈ ఫోన్​ పని చేస్తుంది. 2 జీబీ ర్యామ్​ 16జీబీ స్టోరేజి, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్​ రెండు వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. 13+2 ఎంపీలతో వెనుక వైపు రెండు కెమెరాలు ఈ మోడల్​లో పొందుపరిచారు. ఈ మోడల్​ ధరలు వరుసగా రూ.5,999, రూ.7,999 గా నిర్ణయించింది రియల్​ మి.

ఇన్ఫీనిక్స్ హాట్​ 8

రియల్ మీ సీ2 లానే.. ఇన్ఫీనిక్స్​ హాట్​ 8 మోడల్​లో హీలియో పీ22 ప్రాసెసర్​ను పొందుపరిచారు. 6.52 అంగులాల పూర్తి హెచ్​డీతో..4 జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్​ వేరియంట్​ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీని ఈ ఫోన్​లో పొందుపరిచారు. 13 ఎపీల రియర్ కెమెరా.. 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర రూ.6,999గా ఉంది.

టెక్నో స్పీక్​గో

టెక్​నో స్పీక్​ గో స్మార్ట్​ ఫోన్ హీలియో ఏ22 ప్రాసెసర్​తో 2 జీబీ ర్యామ్​, 16 జీబీ రోమ్ వేరియంట్లో ఈ మోడల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో 8ఎంపీల రియర్ కెమెరా.. 5 ఎంపీల సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్​లో పొందుపరిచారు. ఏఐతో పని కెమెరా పనిచేయడం ఈ మోడల్ ప్రత్యేకత. 3,000 ఎంఏహెచ్​ల బ్యాటరీ సామర్థ్యమున్న ఈ మోడల్ ధర రూ.5,499గా ఉంది.

షియోమి రెడ్​మీ గో

బడ్జెట్ ఫోన్​లో షియోమి నుంచి అందుబాటులో ఉన్న మరో ఫోన్ రెడ్​ మీ గో. 1 జీబీ ర్యామ్ 8 రోమ్​, 1 జీబీ ర్యామ్​ 16 రోమ్ వేరియంట్​లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. స్నాప్​డ్రాగన్ 425 ప్రాసెసర్​తో పనిచేసే ఈ ఫోన్​లో 3,000 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం ఉంది. 8 మెగా పిక్సల్​ల రియర్​ కెమెరా.. 5 ఎంపీల సెల్ఫీ కెమెరాను పొందుపరిచింది షియోమి. బడ్జెట్​ ఫోన్లలో అత్యంత తక్కువ ధర రూ.4,799తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి: రైతు పొలంలో కొండ చిలువ పిల్లలు ప్రత్యక్షం

Last Updated : Oct 1, 2019, 7:06 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details