భాజపాను గెలిపిస్తే.. ఖమ్మం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని భాజపా అభ్యర్థి వాసుదేవరావు హామినిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి ర్యాలీ ప్రారంభం కాగా... మామిళ్ల గూడెం, కమాన్‌బజార్, కస్బా బజార్, బ్రాహ్మణ బజార్ వరకు కొనసాగింది. ఇంటింటికి తిరుగుతూ... తనను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. కేంద్రంలో మోదీయే అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
'నన్ను గెలిపించండి.. ఖమ్మం అభివృద్ధి చేస్తా' - bjp rally
మరికొన్ని గంటల్లో ప్రచారపర్వం ముగియనుంది. ఈ సందర్భంగా భాజపా అభ్యర్థి వాసుదేవరావు ఖమ్మం నగరంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ.. ఓట్లను అభ్యర్థించారు.
'నన్ను గెలిపించండి.. ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తా'
TAGGED:
bjp rally