కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రానున్న ఐదేళ్లలో భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలున్నప్పటికీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ భాజపా ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఏ మంత్రిత్వశాఖ ఇచ్చిన చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంటుందంటున్న కిషన్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి అరుణ్ కుమార్ ముఖాముఖి...
' సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'
రానున్న రోజుల్లో భాజపా దేశంలో అనేక మార్పులు తీసుకురాబోతోందన్నారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా చేసేందుకు సిద్ధమని తెలిపారు.
'రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయి'
Last Updated : May 31, 2019, 7:13 AM IST