పార్లమెంటరీ పార్టీ నూతన కార్యనిర్వాహక కమిటీని ప్రకటించింది భాజపా. లోక్‌సభా పక్షనేతగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. లోక్‌సభాపక్ష ఉపనేతగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఎంపిక చేసింది కమలదళం.
కేంద్రమంత్రి థావర్ చంద్ గహ్లోత్ రాజ్యసభా పక్షనేతగా, పీయూష్ గోయల్ రాజ్యసభాపక్ష ఉపనేతగా వ్యవహరించనున్నారు. భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్థానాన్ని గహ్లోత్‌తో భర్తీ చేశారు.
అమేఠీలో రాహుల్ గాంధీపై ఘన విజయం సాధించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కమిటీలో చోటు కల్పించారు.
సంజయ్ జైశ్వాల్‌ను పార్టీ చీఫ్ విప్‌గా నియమించింది భాజపా. తొలిసారి ముగ్గురు మహిళా ఎంపీలను విప్‌లుగా ఎంపిక చేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 15 మంది ఎంపీలకు విప్‌లుగా బాధ్యతలు అప్పగించింది.