ETV Bharat / briefs
లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తు - telangana
లోక్సభ అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది.
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
By
Published : Mar 17, 2019, 6:12 AM IST
| Updated : Mar 17, 2019, 8:00 AM IST
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తెలంగాణ లోక్సభ స్థానాల నుంచి బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తు ప్రారంభించింది. దిల్లీలోని భాజపా కార్యాలయంలో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఒకే విడతలో నేడు విడుదల చేస్తున్నట్లు సమాచారం.
Last Updated : Mar 17, 2019, 8:00 AM IST