తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బికనీర్​ కేసులో తల్లితో కలిసి ఈడీ విచారణకు వాద్రా - రాబర్ట్​ వాద్రా

బికనీర్​ భూ కుంభకోణం కేసు విచారణలో భాగంగా రాబర్ట్​ వాద్రా, ఆయన తల్లిని ఈడీ నేడు ప్రశ్నించనుంది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ముందుకు హాజరవడం ఆయనకిది నాలుగోసారి.

బికనేర్​ కేసులో తల్లితో కలిసి ఈడీ విచారణకు వాద్రా

By

Published : Feb 12, 2019, 6:24 AM IST

Updated : Feb 12, 2019, 10:58 AM IST

బికనీర్​ కేసులో తల్లితో కలిసి ఈడీ విచారణకు వాద్రా
అక్రమ నగదు బదిలీ కేసులో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ పార్టీ అధినేత రాహుల్​ గాంధీ బావ రాబర్ట్​ వాద్రా నేడు మరోమారు ఈడీ ముందు హాజరు కానున్నారు. రాజస్థాన్​లోని​ బికనీర్ భూ కుంభకోణం కేసులో వాద్రా, అతని తల్లి మౌరీన్​ ఈడీ విచారణకు సహకరించాలని రాజస్థాన్​ హైకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం జైపుర్​లోని ఈడీ కార్యాలయంలో విచారణకు వారు హాజరు కానున్నారు.

నాలుగోసారి విచారణకు వాద్రా...

అక్రమ నగదు బదిలీ ఆరోపణలపై ఇప్పటికే మూడు పర్యాయాలు, సుమారు 24 గంటల పాటు దిల్లీ కార్యాలయంలో వాద్రాను ప్రశ్నించింది ఈడీ. బికనీర్​ భూ కుంభకోణంపై కోర్టు ఆదేశాలతో నాలుగోసారి ఈడీ ముందు హాజరవనున్నారు. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టంలో భాగంగా వాద్రాతో పాటు అతని తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మూడుసార్లు సమన్లు...

బికనీర్​ కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ వాద్రాకు మూడు సార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఈడీ ముందు వాద్రా హాజరుకాలేదు. కోర్టును ఆశ్రయించారు. తమపై ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని వాద్రా కోర్టును కోరారు.

కేసు వివరాలు....

ఇండో-పాక్​ సరిహద్దు ప్రాంతంలోని బికనీర్​లో 374.44 ఎకరాల భూ కేటాయింపుల్లో ఫోర్జరీ జరిగిందని బికనీర్​ తహశీల్దార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై రాజస్థాన్​ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్​ఐఆర్​), ఛార్జ్​షీట్స్​ దాఖలు చేశారు.

Last Updated : Feb 12, 2019, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details