ఈటీవీ భారత్ యాప్ ప్రారంభోత్సవం హమారా భారత్ కదిలే ప్రపంచాన్ని కళ్లముందు నిలుపుతూ.. ఈటీవీ భారత్ యాప్ వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈటీవీ భారత్ యాప్ ప్రారంభోత్సవం కనులపండువగా జరిగింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా ఉదయం 11 గంటల 16 నిమిషాలకు యాప్‌ను లాంచ్ చేశారు.ఈటీవీ భారత్ ఇంగ్లీష్ యాప్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... తెలంగాణ యాప్‌ను రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు,ఆంధ్రప్రదేశ్ యాప్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుప్రారంభించారు. మిగిలిన రాష్ట్రాల ప్రాంతీయ యాప్‌లను ఆయా.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు ప్రారంభించారు.
అద్వితీయం- అసమానం
విశ్వసనీయ సమాచారానికి మారుపేరుగా నిలిచిన ఈనాడు మీడియా నుంచి వచ్చిన విలక్షణమైన యాప్ ఈటీవీ భారత్. దేశంలోనే అతిపెద్ద... మొట్ట మొదటి వీడియో అధారిత యాప్‌గా ముందుకొచ్చింది. 13 భాషల్లో 29రాష్ట్రాల వార్తలు విడివిడిగా ఒకే యాప్ లో అందించే ఏకైక సమాచార స్రవంతి ఈటీవీ భారత్..! 725 జిల్లాల్లో ప్రాతినిధ్యంతో దేశంలోనే అతిపెద్ద వార్తా వ్యవస్థగా భారత్ నెట్వర్క్ అవతరించింది.
సందడిగా ప్రారంభోత్సవం
రామోజీ ఫిల్మ్‌సిటీలో యాప్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహనరావు, ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ డైరెక్టర్ సహరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాపినీడు, అన్ని విభాగాల సిబ్బంది ప్రారంభోత్సవ వేడుకలో భాగమయ్యారు.
ఆంగ్లం | వెంకయ్యనాయుడు (ఉపరాష్ట్రపతి) |
తెలంగాణ | రామోజీరావు (రామోజీ సంస్థల ఛైర్మన్) |
ఆంధ్రప్రదేశ్ | చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) |
మహారాష్ట్ర | దేవేంద్ర ఫడణవీస్ (ముఖ్యమంత్రి) |
అసోం | శరబానంద సోనోవాల్ (ముఖ్యమంత్రి) |
ఛత్తీస్‌గఢ్ | భూపేశ్ బఘేల్ (ముఖ్యమంత్రి) |
దిల్లీ | అరవింద్ కేజ్రీవాల్ (ముఖ్యమంత్రి) |
గుజరాత్ | విజయ్ రూపానీ (ముఖ్యమంత్రి) |
హరియాణా | మనోహర్ లాల్ ఖత్తార్ (ముఖ్యమంత్రి) |
హిమాచల్ ప్రదేశ్ | జైరామ్ ఠాకూర్ (ముఖ్యమంత్రి) |
ఝార్ఖండ్ | రఘుబర్ దాస్ (ముఖ్యమంత్రి) |
కర్ణాటక | హెచ్.డి. కుమారస్వామి (ముఖ్యమంత్రి) |
కేరళ | పినరయి విజయన్ (ముఖ్యమంత్రి) |
మధ్యప్రదేశ్ | కమల్‌నాథ్ (ముఖ్యమంత్రి) |
రాజస్థాన్ | అశోక్ గెహ్లోత్ (ముఖ్యమంత్రి) |
ఉత్తర్‌ప్రదేశ్ | యోగి ఆదిత్యనాథ్ (ముఖ్యమంత్రి) |
ఉత్తరాఖండ్ | త్రివేంద్రసింగ్ రావత్ (ముఖ్యమంత్రి) |
పశ్చిమబంగా | కేసరీనాథ్ త్రిపాఠి( గవర్నర్ ) |
బిహార్ | లాల్జీ టాండన్( గవర్నర్ ) |
ఒడిశా | గణేశీ లాల్( గవర్నర్) |
తమిళనాడు | ఎస్పీ బాలసుబ్రమణ్యం(గాయకుడు) |
జమ్ము&కశ్మీర్, ఉర్దూ | గుల్జార్( ప్రముఖ కవి,రచయిత ) |
పంజాబ్ | మిల్కాసింగ్( మాజీ అథ్లెట్ ) |