తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2019, 6:52 PM IST

ETV Bharat / briefs

టీమ్ ఇండియా కోసం బ్రిటన్​కు 'భారత సైన్యం'

వివిధ ప్రాంతాలకు చెందిన 8 వేల మంది అభిమానులు 'భారత్ ఆర్మీ' సంఘంగా ఏర్పడ్డారు. వీరందరూ ప్రపంచకప్​లో పాల్గొనే విరాట్​సేనకు మద్దతు ప్రకటించనున్నారు.

22 దేశాల నుంచి వేల సంఖ్యలో అభిమానులను కూడగట్టుకుని టీమిండియాకు మద్దతు తెలపనున్న 'ది భారత్ ఆర్మీ'

మిగతా దేశాల కన్నా క్రికెట్​ అంటే భారత్​లో క్రేజ్ ఎక్కువ. మరో రెండు నెలల్లో ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్​ జరగనుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే విరాట్​సేనకు మద్దతుగా.. 22 దేశాల్లోని అభిమానులు ఒక్క చోటుకు చేరనున్నారు. దాదాపు 8,000 మంది 'భారత్ ఆర్మీ'గా ఏర్పడి విరాట్​సేనకు మద్దతు తెలపనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది.

1999 ప్రపంచకప్ సమయంలో నలుగురుతో ప్రారంభమైందీ 'భారత్ ఆర్మీ'. 2015 నుంచి ఇతర దేశాలకు వెళ్లి మరీ టీమిండియాకు మద్దతు తెలుపుతోంది. ఈ సంఖ్యను ప్రస్తుతం పెంచేందుకు వారు కృషి చేస్తున్నారు.

ఈ ప్రపంచకప్​లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్​కు 5వేల నుంచి 6వేల మంది వరకు హాజరుకానున్నారు. యూకేలో ప్రారంభమైన ఈ సంఘం... ప్రాంతాల వారీగా ప్రతినిధులను నియమించి, ప్రపంచం మొత్తం విస్తరిస్తోందని 'భారత్ ఆర్మీ' స్థాపకుల్లో ఒకరైన రాకేశ్ పటేల్ తెలిపారు.

ప్రాంతీయ ఇన్​ఛార్జ్​లు... భారత్, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో మా మద్దతుదార్లను పెంచుతున్నారు. 1990లో తొలి మ్యాచ్​ చూశాను. 30 ఏళ్లుగా భారత్ మ్యాచ్​లు ఎక్కడ జరిగినా అక్కడకెళ్లి చూస్తాను. అక్కడి నుంచి సచిన్ చివరి మ్యాచ్ వరకు ప్రతిదీ వీక్షించాను. -రాకేశ్ పటేల్, భారత్ ఆర్మీ స్థాపకుల్లో ఒకరు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details