తెరాస పని అయిపోయిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నించారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న పార్టీ ఫిరాయింపులను ప్రజలు అసహ్యించుకున్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు. తెరాస ఒంటెత్తు పోకడలకు 2023లోనూ ప్రజలు బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు.
తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పారు: భట్టి - batti vikramarka
సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని భట్టి తెలిపారు. తెరాసది ముగిసిన చరిత్ర అని అన్నారు.
batti