ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ భాజపా ఎంపీ బండి సంజయ్ ఖండించారు. కేసీఆర్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి ఉగ్ర మూలాలను అంతం చేస్తామని మాత్రమే అన్నారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు.
కేసీఆర్ భేషరతు క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్ - bjp bandi sanjay
ప్రధానిని కించపరిచేలా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని భాజపా ఎంపీ బండి సంజయ్ అన్నారు. దిల్లీలో పొర్లుదండాలు పెట్టి, హైదరాబాద్‌లో కేంద్రం మెడలు వంచుతామనటం కేసీఆర్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు.

bandi sanjay