గ్లోబరీనాకు కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఈ అంశంపై విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. మంగళవారం రేవంత్ చేసిన నిరాధార ఆరోపణలు 24గంటల్లోగా వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డికి బాల్క సుమన్ 24గంటల డెడ్‌లైన్ - INTER BOARD
ఇంటర్ ఫలితాల విషయంలో విపక్షాల తీరు సరిగాలేదు. ఇలాంటి సున్నితమైన అంశంలోనూ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన రేవంత్.. 24గంటల్లో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: బాల్క సుమన్
బాల్క సుమన్