తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కుంభమేళా... బాలలు భళా - బాల సాధువులు

పవిత్రమైన కుంభమేళలో బాల సాధువులు తమ దైవభక్తిని చాటిచెప్తున్నారు.

కుంభమేళా... బాలలు భళా

By

Published : Feb 9, 2019, 5:19 PM IST

Updated : Feb 9, 2019, 6:07 PM IST

కుంభమేళా... బాలలు భళా
ఉత్తర్​ప్రదేశ్​లో జరుగుతున్న కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వీరి మధ్య బాల సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను విడిచి సన్యాసం బాట పట్టారు వీరు. డాక్టర్​, ఇంజినీర్ వంటి రంగాల గురించి అస్సలు తెలియదు. వీరికి తెలిసింది ఒక్కటే... సనాతన ధర్మం!

సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను విడిచి వస్తారు. వారికి పెద్దలు గుర్తుకు రారు. ఇతర సాధువులతో జీవిస్తూ దైవభక్తితో పూజలు నిర్వహిస్తారు.

బాల సాధువులపై తండ్రి ప్రభావం...

సనాతన ధర్మంపై వీరికి ఇష్టం పెరగడంలో తండ్రి పాత్ర ఎంతో కీలకం. తండ్రి ఇష్టంతోనే వీరు సాధువులుగా మారతారు. దేశంలోని పంజాబ్​, హరియాణా, గుజరాత్​లోని కొందరు తమ పిల్లలను సనాతన ధర్మ ప్రచారానికి దానం చేస్తారు. అప్పుడు వారి వయసు 2-3ఏళ్లే ఉంటుంది. బాలలు వేర్వేరు అఖాడాల్లో చేరి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభిస్తారు. అక్కడే వేదాలు నేర్చుకుంటారు.

ఈ సారి ఇద్దరు బాలలు కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మెడలో​ రుద్రాక్ష మాలలతో, జపం చేస్తూ సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నారు.

Last Updated : Feb 9, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details