తెలంగాణ

telangana

ETV Bharat / briefs

​​​​​​​ఈటీవీ తెలంగాణకు అవార్డు - ETV RAJENDRAPRASAD

జలవనరుల సంరక్షణలో ఈటీవీ మరోసారి సత్తా చాటింది. ప్రజల్లో అవగాహన పెంచినందుకు..  ఉత్తమ ప్రదర్శన విభాగంలో అవార్డు అందుకుంది. ఈటీవీతో పాటు భూగర్భజలాలు పెంచినందుకు కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి వచ్చింది.

జలవనరుల సంరక్షణలో ఈటీవీ తెలంగాణకు అవార్డు

By

Published : Feb 25, 2019, 1:19 PM IST

జలవనరుల సంరక్షణలో ఈటీవీ తెలంగాణకు అవార్డు
జాతీయ జల అవార్డులను కేంద్ర జలవనరుల శాఖ ప్రదానం చేసింది. ఉత్తమ నీటి సంరక్షణ చర్యలు, నిర్వహణ, వినియోగంలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మీడియా సంస్థలకు ఈ అవార్డులు దక్కాయి. దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ అవార్డులను ప్రదానం చేశారు. నీటి నిర్వహణ, యాజమాన్య విధానం, ఉత్తమ ప్రదర్శనల విభాగంలో ఈటీవీ తెలంగాణకు రెండో స్థానం లభించింది. సంస్థ తరపున న్యూస్​ ఎడిటర్ ఎన్.​రాజేంద్రప్రసాద్​ నితిన్​ గడ్కరీ నుంచి అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపుదలలో కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి వరించింది.ఇవీచదవండి:పద్మారావు గౌడ్ ఏకగ్రీవం

ABOUT THE AUTHOR

...view details