తెలంగాణ

telangana

ETV Bharat / briefs

టాస్ గెలిచిన ఆసీస్​.. ఇంగ్లాండ్ బౌలింగ్ - england

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్​ తొలి టెస్టు మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా మ్యాచ్​కు దూరమయ్యాడు.

టాస్

By

Published : Aug 1, 2019, 3:32 PM IST

Updated : Aug 1, 2019, 3:46 PM IST

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్​ ప్రారంభమైంది. బర్మింగ్​హామ్​ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆసీస్​ కెప్టెన్ టిమ్​పైన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా మ్యాచ్​కు దూరమయ్యాడు.

పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించే అవకాశముంది. వర్షం కురిసే అవకాశం లేకపోలేదు. బర్మింగ్​హామ్​లో​ ఇరు జట్లు 14 సార్లు తలపడ్డాయి. అయితే కంగారూ జట్టు కేవలం మూడు సార్లు మాత్రమే పరాజయం పాలైంది.

జట్లు..

ఆస్ట్రేలియా​:టిమ్​పైన్(కెప్టెన్/కీపర్​), డేవిడ్ వార్నర్, బాన్​క్రాఫ్ట్​, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రేవిస్ హెడ్, మ్యాథ్యూ వేడ్, జేమ్స్ ప్యాటిన్సన్, కమిన్స్​, పీటర్ సిడిల్, నాథన్ లైయన్.

ఇంగ్లాండ్​:రూట్(కెప్టెన్), బర్న్స్​, జేసన్ రాయ్, జోయ్​ డెన్లై, జాస్ బట్లర్, బెన్ స్టోక్స్​, బెయిర్​ స్టో(కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.

Last Updated : Aug 1, 2019, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details