ప్రజలు దొరలపాలన, ఫామ్‌హౌజ్ రాజకీయాలను గమనిస్తున్నారని ఎన్నికలు వచ్చినప్పుడు వాటికి స్వస్తి పలకడం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు బోర్డు వీలైనంత త్వరలో తెస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు మద్దతు ధర కోసం ప్రక్రియను మొదలుపెట్టానని చెప్పారు. కోరుట్లకు మెడికల్ కళాశాల కోసం కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని... కరీంనగర్లో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నందున జగిత్యాలకు తీసుకువస్తామన్నారు.
ఫామ్‌హౌజ్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి: అర్వింద్ - nzb
పసుపు బోర్డు వీలైనంత త్వరలో తెస్తానని హామీ ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. జగిత్యాలకు మెడికల్ కళాశాల తీసుకువస్తామన్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్