'మీ భవిష్యత్తు - నా బాధ్యత' అంటూ మరోసారి ప్రజామోదం కోసం ఏపీలో ఎన్నికల బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీ... ఎన్నికల ప్రణాళిక హామీ పత్రాన్ని విడుదల చేసింది. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో పొందుపరిచింది. కిందటిసారి పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందడగు వేసిన తెదేపా... ఈసారి ఎన్నికలకు సరికొత్త అంశాలతో ఆకర్షించే ప్రయత్నం చేసింది.
ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ... సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసింది. రైతన్నలకు పెద్దపీట వేసింది. సాగునీటి రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈసారి కొత్తగా యువజన ప్రణాళిక రూపొందించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కాపులకు 5 రిజర్వేషన్ల అమలు మొదలు...అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్నికల హామీ పత్రంలో పేర్కొంది.
1)వ్యవసాయం-అనుబంధ రంగాలు:
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్షంగా పెట్టుకున్న ఏపీ సర్కార్...అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టి...రైతన్నకు దన్నుగా నిలిచింది. వచ్చే ఐదేళ్ల కాలానికి రైతుల్లో మరింత భరోసా నింపేందుకు కీలక అంశాలను ఎన్నికల ప్రణాళిక హామీ పత్రంలో పొందుపర్చింది.
- వచ్చే ఐదేళ్లకు అన్నదాత సుఖీభవ పథకం అమలు
- రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
- రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్ (పగటిపూట)
- వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరల ఒడుదొడుకులను తట్టుకునేందుకు రూ. 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
- మండల స్థాయిలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల
- రాష్ట్రాన్ని హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కోటి ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణ
- తీర ప్రాంతాల్లో ఫీషరీస్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు
- పాడి రైతుల కోసం గోపాలమిత్రుల వ్యవస్థ పటిష్టం, ఖాళీల భర్తీ
2) నీటి పారుదల రంగం
ఏపీలో తెదేపా సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలాల కరవు తరిమికొట్టాలన్న లక్ష్యంతో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నదులు అనుసంధానంతో ప్రాజెక్టుల పూర్తని అజెండాలో పెట్టుకుంది.
- కరవురహిత రాష్ట్రంగా మార్చటం
- 2 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటం
- 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగు నీరు
- నీటి లభ్యత బట్టి ఎత్తిపోతల పథకాల నిర్మాణం
3) మహిళా సాధికారత
డ్వాక్రా రుణాల అందజేతతోపాటు...పసుపు-కుంకుమ వంటి పథకాలతో మహిళా సాధికారతకు కృషి చేస్తోన్న తెదేపా సర్కార్...వచ్చే ఐదేళ్ల కాలంలో మరిన్ని వినూత్న పథకాలు అందించేందుకు సిద్ధమైంది.
- పసుపు-కుంకుమ పథకం కొనసాగించటం
- డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు
- మహిళా ఉద్యోగులకు స్కూటర్ కొనుగోలపై రాయితీ
- పింఛన్లు పొందేందుకు ఉన్న అర్హత వయసును 55 ఏళ్లకు తగ్గింపు
- చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం
- రాబోయే ఐదేళ్ల కాలంలో మహిళలను ఆర్థిక సాయాన్ని 2 లక్షల కోట్లకు పెంచటం
- వడ్డీ రాయితీ అర్హత పరిమితి రూ.10 లక్షలకు పెంపు
- ఐటీడీఏల్లో హోమ్ ఫర్ ప్రేగ్నస్ట్ విమెన్ ఏర్పాటుకు హామీ
4)పేదరికం
పేదరికాన్ని నిర్మూలించేలా బలహీనవర్గాల, మహిళ సంక్షేమ కోసం కీలకమైన పథకాలు అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా రూపోందించిన అనేక పథకాలను కొనసాగింపుతోపాటు...ఆర్థిక సహాయన్ని పెంచుతున్నట్లు తెదేపా మేనిఫెస్టో కమిటీ నిర్ణయం తీసుకుంది.
- ప్రస్తుతం ఉన్న 2వేల పెన్షన్‌ను 3 వేల రూపాయలకు పెంచటం
- పింఛన్‌దారుల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60కి తగ్గింపు
- చంద్రన్న పెళ్లికానుక లక్ష రూపాయలకు పెంపు
- చంద్రన్న బీమా సొమ్ము 10 లక్షలకు పెంపు
- 20 వేల జనాభా దాటిన మేజర్ గ్రామపంచాయతీల్లో అన్న క్యాంటీన్లు