తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నౌహీరా షేక్​పై సీసీఎస్​లో మరో ఫిర్యాదు

హీరా గ్రూప్​ వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్​ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె చేతిలో మోసపోయిన వారు హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులను ఆశ్రయిస్తున్న విషయం తెలుసుకుని తాజాగా ఆంధ్రప్రదేశ్​కు చెందిన విశ్రాంత ఇంజినీర్​ అబ్దుల్​ జబ్బార్ కూడా ఫిర్యాదు చేశారు.

నౌహీరా షేక్​పై సీసీఎస్​లో మరో ఫిర్యాదు నమోదు

By

Published : May 29, 2019, 5:07 AM IST

Updated : May 29, 2019, 7:08 AM IST

నౌహీరా షేక్​పై సీసీఎస్​లో మరో ఫిర్యాదు నమోదు

బంగారంపై పెట్టబడులు పెడితే అధిక లాభాలిస్తామని మదుపర్ల వద్ద వేల కోట్లు కాజేసిన నౌహీరా షేక్​ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నౌహీరా మాటలకు మోసపోయిన ఆంధ్రప్రదేశ్​కు చెందిన విశ్రాంత ఇంజినీర్ అబ్దుల్ జబ్బార్ కూడా పెట్టుబడులు పెట్టారు.

2016లో ఆయన తన పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద హీరా గ్రూప్ సంస్థల్లో దఫాలుగా రూ.2.14కోట్లు పెట్టుబడి పెట్టారు. హీరా గ్రూప్స్ 2016, 2017, 2018 సంవత్సరాల్లో వడ్డీ సక్రమంగానే చెల్లించారు. గతేడాది మే నుంచి డబ్బులు రావడం ఆగిపోగా.. నౌహీరా షేక్​ను అడిగారు. సరైన సమాధానం ఇవ్వనందున ఆందోళనకు గురయ్యారు.

హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్​లో ఆమెపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకొని... అబ్దుల్ జబ్బార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో 3లక్షలు పెట్టుబడి పెడితే... సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నారని... బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి హీరా గ్రూప్స్​లో పెట్టుబడి పెట్టి మోసపోయానని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్​

Last Updated : May 29, 2019, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details