అంజలి జిమ్ వర్కవుట్ చూశారా? - జిమ్‌లో చెమటోడ్చుతున్న అంజలి
టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు చిత్రాలతో ఆకట్టుకున్న అంజలి.. అందాలకు మెరుగులు దిద్దుకునేందుకు జిమ్‌లో చెమటోడ్చుతోంది.
అంజలి జిమ్ వర్కవుట్ చూశారా?
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ, గీతాంజలి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి. తెలుగు అమ్మాయి అయిన ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించింది. అడపాదడపా తెలుగు చిత్రాల్లోనూ కనిపించింది. ఫిట్‌గా ఉండేందుకు రోజువారీ దినచర్యలో భాగంగా వ్యాయామశాలలో చెమటోడ్చుతోందీ భామ.
ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి 'సింధూబాద్'లో నటిస్తోంది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల కానుందీ చిత్రం.