తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెరపైకి విజయ్​ తమ్ముడు, రాజశేఖర్​ కూతురు - దేవరకొండ బ్రదర్స్

అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించి స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తాజాగా అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు.

దొరసాని సినిమాతో హీరోగా పరిచయమవుతున్న ఆనంద్ దేవరకొండ

By

Published : Apr 4, 2019, 11:09 AM IST

విభిన్న సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలో అతడి తమ్ముడు వెండితెరపై కనిపించనున్నాడు. 'దొరసాని' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

కేవిఆర్ మహేంద్ర 'దొరసాని' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్​గా అరంగేట్రం చేస్తోంది.

యష్ రంగినేని, మధుర శ్రీధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్​లుక్ విడుదలైంది. ఇప్పటికే టీజర్​ చిత్రీకరించారని, అందులో హీరో హీరోయిన్ల మధ్య లిప్​లాక్ సీన్ ఉంటుందని సమాచారం.

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్న బాటలో తమ్ముడు టాలీవుడ్​లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details