తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బాక్సింగ్ ఆసియన్ ఛాంపియన్​షిప్​లో అమిత్, శివ థాపా

బ్యాంకాక్ వేదికగా ఏప్రిల్ 19 నుంచి ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్ జరగనుంది. భారత బాక్సర్ అమిత్ పంగల్ 52 కేజీల విభాగంలో ఈ టోర్నీకి అర్హత సాధించాడు. మరో ఆటగాడు శివ థాపా నాలుగోసారి పతకం వేటకు సిద్ధమవుతున్నాడు.

ఆసియన్ ఛాంపియన్​షిప్​లో అమిత్, శివ థాపా

By

Published : Mar 20, 2019, 9:19 PM IST

ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన అమిత్ పంగల్ తొలిసారి ఈ టోర్నీలో అడుగుపెడుతుంటే... శివథాపా మాత్రం వరుసగా నాలుగోసారి పతకం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. వచ్చే నెలలో మొదలవుతున్న ఆసియన్ ఛాంపియన్​షిప్​ పోటీల్లో వీరిద్దరూ పాల్గొనున్నారు. అమిత్​ 52 కేజీలు, శివథాపా 60 కేజీల విభాగంలో పోటీకి దిగనున్నారు.

బ్యాంకాక్ రాజధాని థాయ్​లో ఏప్రిల్ 19 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. పురుషులతో పాటు మహిళల ఛాంపియన్​షిప్​నూ​ నిర్వహించనున్నారు.

అరంగేట్రం అదిరేనా...

ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా స్మారక టోర్నీలో 49 కేజీల విభాగంలో పాల్గొన్న పంగల్​.... పసిడి కైవసం చేసుకున్నాడు. 2020 ఒలింపిక్స్​లో 49 కేజీల విభాగం తొలగించడంతో 52 కేజీల విభాగానికి మారిన ఈ హర్యానా ఆటగాడు...టోర్నీల్లో తొలుత సత్తా చాటాలని నిశ్చయించుకున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా జర్మనీలోశిక్షణ తీసుకున్నాడు.

నాలుగోసారి వేట...

భారత స్టార్​ బాక్సర్​ శివ థాపా.. ఇటీవల జరిగిన జీబీ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో....కాంస్య పతకం సాధించాడు. ఈ ఉత్సాహంతోనే ఆసియన్​ ఈవెంట్లలో పతక వేటకు బయలుదేరుతున్నాడు.

2013 ఆసియన్ ​టోర్నీలో స్వర్ణం, 2015లో రజతం, 2017లో వెండి పతకాలను సాధించాడీ మాజీ ప్రపంచ ఛాంపియన్​​.

ఒలింపిక్స్​ కోసమే ఇదంతా...

2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్​లో కొత్తగా 63 కేజీల విభాగం రానుంది. ఇంతకు ముందున్న 57 కేజీల విభాగాన్ని తిరిగి తీసుకొచ్చారు. 49, 56, 60, 64 కేజీల విభాగాల్ని తొలగించారు. దీంతో 60 కేజీల విభాగంలో ఉన్న శివ థాపా సహా కామన్వెల్త్​లో వెండి పతకం సాధించిన మనీష్ కూమార్.... 63 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది.

రష్యా ఏకటెరిన్​బర్గ్​లో సెప్టెంబరు 7 నుంచి 21 వరకు 'ప్రపంచ ఛాంపియన్​షిప్' జరగనుంది.

' ఎవరైతే ఆసియన్​ ఛాంపియన్​ షిప్​లో పసిడి, వెండి పతకాలు సాధిస్తారో...వారికే ప్రపంచ ఛాంపియన్​ షిప్ ఎంపికలో తొలి ప్రాధాన్యమిస్తాం'.
-జాతీయ శిక్షకుడు, సీఏ కుట్టప్ప

ఆసియన్ ఛాంపియన్​షిప్ పురుషుల జట్టు:

దీపక్(49కేజీ), అమిత్ పంగల్(52 కేజీ), కవిందర్ సింగ్ బిస్త్(56 కేజీ), శివ థాపా(60 కేజీ), రోహిత్ తోకాస్(64 కేజీ), ఆశిష్(69కేజీ),ఆశిష్ కుమార్(69కేజీ), బ్రిజేష్ యాదవ్(81కేజీ),నమన్ తన్వార్(91కేజీ), సతీశ్ కుమార్(+91 కేజీ).

ABOUT THE AUTHOR

...view details