తెలంగాణ

telangana

ETV Bharat / briefs

లాంఛనంగా ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. అమర్​నాథ్ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. వాతావరణం అనుకూలంగా ఉందని నిర్ధరణ అయిన తర్వాత భక్తులను మొదటి రోజు నుంచే అధికారులు యాత్రకు అనుమతించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది.

లాంఛనంగా ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర

By

Published : Jul 2, 2019, 1:58 PM IST

లాంఛనంగా ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమక్షంలో ఆలయ తాళాలు తెరిచిన పూజారులు.. మొదట పూజ, హారతి నిర్వహించారు. ఈ పూజలో గవర్నర్​, అమర్​నాథ్ ఆలయ బోర్డు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 4రోజులుగా వర్షం పడవకపోవడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో భక్తులను యాత్రకు అనుమతించారు. గతంలో ఎప్పుడు లేని స్థాయిలో భద్రత మధ్య యాత్ర కొనసాగుతోంది. అదనపు బలగాలను మోహరించడంతో పాటు.. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా గుహ వద్ద పెద్ద ఎత్తున మంచు పేర్కొనిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడగా.. యాత్రకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఆర్మీ, సీఆర్​పిఎఫ్​ దళాలు దారికి అడ్డుగా ఉన్న చరియలు తొలగించి.. యాత్రను పునప్రారంభించారు.

ఈసారి యాత్ర ప్రారంభం సోమవారం రావడం... మాస శివరాత్రి కూడా కలసి రావడం వల్ల మొదటి రోజే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇవీ చూడండి:ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న!

ABOUT THE AUTHOR

...view details