తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అంతా మీ ఇష్టమేనా: సుప్రీంకోర్టు - ts

కళాశాల రుసుముల నిర్ణయాధికారం కేసులో హైదరాబాద్ వాసవి ఇంజినీరింగ్ కాలేజీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణయాధికారం తమకే ఇవ్వాలన్న వాదనలను కొట్టేసింది. ఫీజు నియంత్రణ అధికారం ప్రభుత్వ రుసుము నియంత్రణ కమిటీకే ఉంటుందని స్పష్టం చేసింది.

ధర్మాసనం

By

Published : Mar 13, 2019, 5:24 PM IST

ధర్మాసనం
సుప్రీంకోర్టులో వాసవి ఇంజినీరింగ్ కళాశాల రుసుముల వ్యవహారంపై విచారణ జరిగింది. ఫీజు నిర్ణయాధికారం కళాశాలలకే ఇవ్వాలని కాలేజీ తరఫున సీనియర్ న్యాయవాది పాలీ నారీమన్ కోరగా.. జస్టిస్ అరుణ మిశ్రా బెంచ్​ ఆయన వాదనలను తిరస్కరించింది. ప్రైవేటు కళాశాలల తీరు తెలుసని అభిప్రాయపడిన ధర్మాసనం... నిబంధనల విషయంలో వారి తీరును ప్రస్తావించింది. ప్రభుత్వ రుసుము నియంత్రణ కమిటీకే నిర్ణయాధికారం ఉంటుందని తెలిపింది.

వాసవి కళాశాల ప్రవేశ రుసుమును ఫీజు నియంత్రణ మండలి రూ.97 వేలుగా నిర్ణయించగా... కళాశాల యాజమాన్యంహైకోర్టును ఆశ్రయించి లక్షా 60 వేలకు ఫీజు పెంచుకున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఫీజు నిర్ణయాధికారం తమకే ఉండాలని వాదించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల ఫీజు వివరాలను, మిగిలిన కాలేజీల ఫీజు వివరాలను సుప్రీంకోర్టు అడిగి తెలుసుకుంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details