తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆగిన ప్రజా గళం... అరుణోదయ రామారావు హఠాన్మరణం

40 ఏళ్లుగా వామపక్ష ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన పోరాట యోధుడు అస్తమించాడు. సాంస్కృతికోద్యమానికి అంకితమైన ఆ విప్లవ తార నింగికెగిసింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ప్రజా కళాకారుడు నేలకొరిగాడు. ప్రజల సమస్యలను పాటతో చెప్పే ఆ గళం ఆగిపోయింది.

పాటే... తన బాట...

By

Published : May 5, 2019, 8:26 PM IST

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామారావు(65) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుకు గురైన రామారావును హైదరాబాద్​లోని దుర్గాబాయి దేశ్​ముఖ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసినప్పటికీ మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావటంతో 2 గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

పాటే... తన బాట...

రామారావు స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని. 1955 జులై 1న జన్మించిన రామారావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించారు. మొలగవల్లి సత్యం అలియాస్ అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతికోద్యమానికి అంకితమయ్యారు. డప్పు వాయిస్తూ... ప్రజా సమస్యలను పాట రూపంలో చెప్పేవారు. సుదీర్ఘకాలం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో పని చేశారు.

ప్రముఖులు నివాళులు...

రామారావు భౌతిక కాయాన్ని విద్యానగర్​లోని మార్క్స్​ భవన్​లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. నివాళులు అర్పించేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివస్తున్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకట రామయ్య, తెజస అధ్యక్షుడు కోదండరాం, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్​, సినీగేయ రచయిత సుద్దాల అశోక్​తేజ తదితరులు నివాళులర్పించారు. రేపు ఉదయం 10 గంటలకు అంబర్​పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు.

పాటే... తన బాట...

ABOUT THE AUTHOR

...view details