జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం చింతపల్లికి చెందిన శిరీషా తొలికాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఇద్దరు మగ పిల్లలు కాగా... ఒక అమ్మాయి. ముగ్గురు శిశువులతో పాటు తల్లి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పిల్లలను చూసేందుకు స్థానికులు ఆస్పత్రికి క్యూ కట్టారు.
తొలి కాన్పులో ముగ్గురు శిశువుల జననం - JAGTIAL
ఒక్క కాన్పులో ఒక్కరు లేదా కవలలు జన్మించటం సాధారణ విషయమే. కానీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఏకంగా ముగ్గురు శిశువులకు తొలి కాన్పులోనే జన్మనిచ్చింది ఓ మహిళ.
A WOMEN GIVE BIRTH THREE BABIES IN ONE DELIVERY AT JAGTIAL