నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఎలుగుబంటి దాడికి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. జీవనోపాధి కోసం మూలికలు సేకరించేందుకు రాముడు సమీపంలోని నల్లమల అడవికి వెళ్లాడు. మూలికలు తవ్వడానికి వెళ్లగా... రాయి పక్కనే ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్ర స్థాయిలో గాయాలు కావటంతో రాముడు అక్కడే మృతిచెందాడు. ఈ ఘటనను దూరంగా ఉండి గమనించిన రాముడి మనవరాలు కుటుంబసభ్యులకు తెలుపగా శవాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. పోలీసులు శవ పరీక్ష కోసం కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. రాముడికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య నిరంజనమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎటుగుబంటి దాడికి ఓ వ్యక్తి మృతి - BEAR
పొట్టకూటి కోసం మూలికలు అమ్ముకుంటుంటాడు రాముడు. వాటిని సేకరించేందుకు అడవికి వెళ్లాడు. రాయి పక్కనున్న ఎలుగుబంటిని గమనించలేకపోయాడు. మూలిక తవ్వుదామని ప్రయత్నించేలోపే రాముడి మీద పడి తీవ్ర స్థాయిలో దాడి చేసింది.
A MAN DIED DUE TO BEAR ATTACK